వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

MBNR: కౌకుంట్ల మండలం రేకులంపల్లిలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం సునీత బుధవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఎండ తీవ్రత దృష్ట్యా కేంద్రం వద్ద తాగునీటి వసతి కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.