KGBVలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
VKB: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి బుధవారం వికారాబాద్ KGBVలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులు, విద్యా బోధనను పరిశీలించిన ఆయన, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులకు పూర్తిస్థాయిలో చేరవేయాలని, అశ్రద్ధ వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.