'ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి'
VZM: ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్వేచ్ఛా వాతావరణం భారతదేశంలో ఉందంటే అది సర్దార్ వల్లభాయ్ పటేల్ వలనే అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉద్ఘాటించారు. ఆ మహా నాయకుడి 150వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన గొప్పతనాన్ని యువతకు, భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈరోజు పోలీస్ ప్రాంగణం నుంచి బాలాజీ కూడలివరకు సమైక్యతా ర్యాలీను నిర్వహించుకొంటున్నట్లు తెలిపారు.