తప్పుడు ఆరోపణలపై సీఎం భార్య కేసు

తప్పుడు ఆరోపణలపై సీఎం భార్య కేసు

అసోం సీఎం హిమంత భార్యకు 3 దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై సీఎం హిమంత మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలను ప్రభావితం చేసేందుకే ఇలాంటి విమర్శలు చేశారని ధ్వజమెత్తారు. దానికి శిక్ష అనుభవించక తప్పదని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై తన భార్య కేసు పెట్టినట్లు వెల్లడించారు. పోలీసులు చట్టం ప్రకారం దీనిపై చర్యలు తీసుకుంటారనే భావిస్తున్నట్లు చెప్పారు.