తొర్రూరులో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం

తొర్రూరులో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం

MHBD: తొర్రూరు మండలంలో CPM ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామ గ్రామాన అమరవీరుల స్థూపాల వద్ద వారికి జోహార్లు అర్పిస్తూ, వారి త్యాగాలను స్మరించుకున్నారు. మండల కార్యదర్శి MD యాకూబ్ మాట్లాడుతూ.. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన ఈ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమిని పంచినట్లు, 4 వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు నెలకొన్నట్లు తెలిపారు.