నాడు కర్నూలు.. నేడు వరంగల్

నాడు కర్నూలు.. నేడు వరంగల్

2009లో వచ్చిన భారీ వరదలకు AP కర్నూలు జిల్లా జలదిగ్బంధమైన విషయం తెలిసిందే. అయితే, మొంథా తుఫాన్ కారణంగా TGలోని వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు 45 కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. మున్నేరు వాగు ఉధృతి పెరిగింది. రహదారులపై నీళ్లు చేరడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. కాగా, నాటి కర్నూలు సంఘటనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.