VIDEO: ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు
VZM: నగరంలోని స్థానిక ధర్మపురిలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మంగళవారం తరలించారు. ధర్మపురిలో నివాసం ఉంటున్న మూడు ఇళ్లకు వర్షపు నీరు చుట్టుముట్టింది. సమాచారం అందుకున్న ఎస్ఐ అశోక్ కుమార్ తన సిబ్బందితో కలసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎవరికైనా సమస్య వస్తే తమను సంప్రదించాలని కోరారు.