ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
WGL: GWMC 16వ డివిజన్ పరిధి గీసుగొండ మండలంలోని గరీబ్ నగర్, ధర్మారం గ్రామాలలో శుక్రవారం నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని, రిబ్బన్ కట్ చేసి ఇళ్లను ప్రారంబించారు. పేదవారి జీవితంలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.