కూటమి అభ్యర్థుల గెలుపుకు బుల్లితెర నటులు

కూటమి అభ్యర్థుల గెలుపుకు బుల్లితెర నటులు

అనకాపల్లి: జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం కె కోటపాడు మండల కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, శాసనసభ టీడీపీ పార్టీ అభ్యర్థి బి.సత్యనారాయణ తరపున టీవీ నటులు కార్తీకదీపం సీరియల్ హీరో నిరూపమ్ ( కార్తీక్ బాబు ) దంపతులు ప్రచారం చేసి, సందడి చేశారు. వీరిని చూసేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో రావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.