పోలీసుల అప్రమత్తతతో తల్లీ బిడ్డలు సురక్షితం
KRNL: జిల్లా మంత్రాలయం పోలీసులు అప్రమత్తతతో తల్లీ, ఇద్దరు పిల్లలను సురక్షితంగా కాపాడారు. బెంగళూరుకు చెందిన సౌమ్య, భర్తతో గొడవపడి పిల్లలతో కలిసి తుంగభద్ర నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బెంగళూరులోని పోలీస్ స్టేషన్ ఎస్సై ద్వారా సమాచారం అందుకున్న మంత్రాలయం ఎస్సై శివాంజల్, సకాలంలో స్పందించి వారిని రక్షించారు.