నేడు, రేపు స్కూళ్లకు సెలవు

నేడు, రేపు స్కూళ్లకు సెలవు

BHNG: జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, జిల్లాలోని పాఠశాలలకు నేడు, రేపు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్, డీఈవోకు ఉత్తర్వులు అందాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విధిగా సెలవులు పాటించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.