‘పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వీడండి’

‘పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వీడండి’

కర్నూలులో లక్ష్మినగర్, మద్దూర్‌నగర్, ప్రకాశ్‌నగర్‌లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ పి. విశ్వనాథ్ పరిశీలించారు. నిర్లక్ష్యం చేసిన శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ చెన్నయ్యతో పాటు ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో 100% డోర్ టూ డోర్ చెత్త సేకరణ జరిగేలా చూడాలని, ఫిర్యాదులు రాకుండా సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.