పాఠశాలలో విష ప్రయోగం కలకలం

ADB: ఇచ్చోడ మండలం ధరంపురి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం కలకలం రేపింది. స్కూల్ పిల్లల కోసం వినియోగించే నీరు, వంట సామగ్రిపై దుండగులు పురుగు మందు చల్లినట్లు ప్రధాన ఉపాధ్యాయులు గుర్తించడంతో 30 విద్యార్థులకు ప్రమాదం తప్పింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్న భోజనం, వంట గది ఏరియాలో పురుగు మందు డబ్బాను గుర్తించారు.