పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు
MNCL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సరిపడ పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని సీపీ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని, దాంతో ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దని సూచించారు.