32 వైన్ షాపులకు 117 దరఖాస్తులు
ASF: ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 32 మద్యం షాపులకు ఇప్పటివరకు 117 దరఖాస్తులు వచ్చినట్లుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దరఖాస్తు ఫీజు గతంలో కంటే రూ. లక్ష ఎక్కువ ఉండటంతో వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో అత్యధికంగా వాంకిడి మద్యం దుకాణానికి 43 దరఖాస్తులు వచ్చాయి. పెంచికల్పెట్, కౌటాల, సిర్పూర్ టి మండలాల్లోని వైన్స్‌కు ఇంకా బోణీ కాలేదన్నారు.