రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు

రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు

కాకినాడ: పెద్దాపురం మండలం జిరాగంపేట గ్రామంలో గురువారం రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయాలు అయిన వారిని అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.