ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం.. తప్పిన ప్రమాదం

ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం.. తప్పిన ప్రమాదం

VKB: శంకర్‌పలిలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. ముందు వెళ్తున్న కారును అతి వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు కారు డ్రైవర్‌ను కాపాడారు. కారు పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వికారాబాద్ నుంచి శంకర్ పల్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.