VIDEO: హిట్ టీవీ కథనానికి స్పందన
NLG: మండలంలోని కొత్తపల్లి 4వ వార్డులో వీధి దీపాలు వెలగకపోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఇటీవల HIT TVలో కథనం వచ్చింది. ఈ కథనానికి స్థానిక సర్పంచ్ రేణుక రాజు స్పందించి వార్డులో వెలగని వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టి నూతన వీధి దీపాలను అమర్చారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన HIT TVకి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.