'రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించండి'
GNTR: ఫిరంగిపురం నుంచి వేములూరిపాడు వెళ్లే మార్గంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జెడ్పీటీసీ కత్తిరేణమ్మ కోరారు. 3 నెలలుగా ఈ రహదారిపై ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చలికాలం దృష్ట్యా పొగమంచు వల్ల ప్రమాదాలు మరింత పెరిగే ఆస్కారం ఉందన్నారు. అధికారులు తక్షణమే ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.