ఎస్పీని అభినందించిన కలెక్టర్
W.G: జాతీయ స్థాయి దర్యాప్తు విభాగంలో 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పథక్' అవార్డును జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఇటీవల సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ నాగరాణి ఆయనను ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆయనను కలెక్టర్ అభినందించారు.