అవుకు మండలంలో వరి నాట్లు షురూ

అవుకు మండలంలో వరి నాట్లు షురూ

NDL: అవుకు మండల పరిధిలో వరి నాట్లు విస్తృతంగా మొదలయ్యాయి. మండలంలోని రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరు ఉండటంతో రైతులు వరి సాగును ముమ్మరం చేశారు. వరినాట్లు మొదలుపెట్టడంతో మహిళా కూలీల అవసరం పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా కూలీలు స్థానికంగా దొరక్కపోవడంతో రైతులు పొరుగు ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు.