కార్తీక పూజల్లో పాల్గొన ఎమ్మెల్యే
చిత్తూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో గురువారం రాత్రి కార్తీక పూజలు నిర్వహించగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. దొడ్డిపల్లె సప్త కనికమ్మల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దర్శనం పొందారు. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శివాలయాన్ని సందర్శించారు. తరువాత అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదం అందించారు.