సీపీఎం జిల్లా నూతన కార్యదర్శిగా షేక్ మాబు

ప్రకాశం: సీపీఎం నూతన జిల్లా కార్యదర్శిగా సంతనూతలపాడు మండలం మంగమూరుకు చెందిన షేక్ మాబు ఎన్నికయ్యారు. చీమకుర్తిలో జరుగుతున్న రాష్ట్ర సీపీఎం 14వ రాష్ట్ర మహా సభలు సందర్భంగా మూడవరోజు సీపీఎం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా షేక్ మాబు ఎన్నికయ్యారని సీపీఎం నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.