సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన
TG: హైదరాబాద్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. 6 గ్యారెంటీలు అమలు చేయాలని.. 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచిత పథకాల హామీలతో ప్రజలను మోసం చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో సర్కార్ విఫలమైందన్నారు.