'ఇకపై కుల ధ్రువీకరణ పత్రాలు పొందడం సులభం'

VKB: కుల ధ్రువీకరణ పత్రాలకు ప్రభుత్వం నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందని తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి శనివారం తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రాల గురించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పాత కుల ధ్రువీకరణ సర్టిఫికేట్ నంబర్‌తో కొత్త సర్టిఫికేట్ తీసుకోవాలని తెలిపారు. మీ సేవలో దరఖాస్తు చేసుకుని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగే పని లేదన్నారు.