74 మంది ఎమ్మెల్యేలకు మమత షాక్

74 మంది ఎమ్మెల్యేలకు మమత షాక్

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 291 మందితో TMC జంబో జాబితా విడుదల చేశారు. ఏకంగా 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించి షాకిచ్చారు. భవానీపుర్ నుంచి సువేందు అధికారితో మమత తలపడనున్నారు. పాత, కొత్త కలయికతో రూపొందించిన ఈ జాబితాలో 52 మంది మహిళలు, యువత, క్రీడాకారులకు ప్రాధాన్యమిచ్చారు. 11 జనరల్ సీట్లలో ఎస్సీలను బరిలోకి దించనున్నారు. 3 సీట్లను గూర్ఖా మోర్చాకు కేటాయించారు.