అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

వరంగల్: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను శనివారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అగ్నిమాపక అధికారులకు సూచించారు.