VIDEO: శ్రీ భద్రకాళీ ఆలయాన్ని దర్శించిన అన్నా లెజినోవా
వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇవాళ సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.