వైరాలో మద్యం సిండికేట్ దందా..?
KMM: వైరాలో మద్యం సిండికేట్ దందా కొనసాగుతోందని స్థానిక మందుబాబులు వాపోతున్నారు. నాలుగు నెలలుగా ఎమ్మార్పీ ధరలకు మద్యం అమ్మిన వ్యాపారులు ఇప్పుడు సిండికేట్‌గా మారి అక్రమ వసూళ్లు చేస్తున్నారని అంటున్నారు. బీరు బాటిల్‌పై రూ.30, క్వాటర్‌పై రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. మండలంలో మొత్తం ఐదు వైన్ షాపులు, ఒక బార్ ఈ సిండికేట్‌లో ఉన్నట్లు సమాచారం.