VIDEO: మార్కాపురంలో భారీ వర్షం
ప్రకాశం: మార్కాపురం పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో ఓ మోస్తారు వర్షం కురిసింది. గత 15 రోజులను నుంచి ఎండ తీవ్రత ఉండగా సాయంత్రం 6 గంటల నుంచి వాతావరణంలో మార్పులు జరిగి వర్షం పడింది. ఆయా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. బహిరంగ ప్రదేశాలు, టవర్లు, ఎత్తైన భవనాల వద్ద జనాలు ఉండవద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.