'ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తం అవసరం'
ప్రకాశం: ఆన్‌లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్‌లు ద్వారా సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయాలన్నారు.