జూదం ఆడుతున్న ఏడుగురు అరెస్ట్
కృష్ణా: ఘంటసాల(మం) శ్రీకాకుళం గ్రామం ఔట్స్‌కర్ట్స్‌లోని డొంక ప్రాంతంలో అక్రమంగా జూదం ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు బుధవారం జూద శిబిరంపై దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు రూ. 28,650 బైకులు 6, సెల్ ఫోన్‌లు -3 స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.