మజ్జిగ, చలివేంద్ర కేంద్రం ప్రారంభం
W.G: వేసవి తీవ్రత దృష్ట్యా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ మరియు జమాతే ఇస్లామి హింద్ సంయుక్త ఆధ్వర్యంలో ఆకివీడులో మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.డి.బిలాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసవి కాలంలో ప్రజలకు చల్లటి మజ్జిగ, తాగునీరు అందించడం ఒక సామాజిక బాధ్యత అన్నారు.