INDW vs SAW: జెమిమా రోడ్రిగ్స్ సెంచరీ

శ్రీలంకలోని కొలంబో వేదికగా దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇది ఆమె ODI కెరీర్‌లో రెండో సెంచరీ. స్మృతి మంధాన(51) హాఫ్ సెంచరీ చేసి ఔట్ అయింది. జెమిమాకు తోడుగా దీప్తి(46*) క్రీజులో ఉంది. ప్రస్తుతం 40 ఓవర్లలో IND స్కోర్ 237/4.