నేడు నీటి సరఫరా నిలిపివేత
ప్రకాశం: జల రక్ష మాసంలో భాగంగా ఇవాళ కనిగిరి పట్టణంలోని స్థానిక ఎన్ఏపీ ట్యాంకులో క్లీనింగ్ కార్యక్రమం చేపడుతున్నట్లు మున్సిపల్ కమీషనర్ కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. కమీషనర్ మాట్లాడుతూ.. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు పట్టణంలో నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.