3 ఏళ్లకే పిల్లలను స్కూల్‌కు పంపించాలి: సుధామూర్తి

3 ఏళ్లకే పిల్లలను స్కూల్‌కు పంపించాలి: సుధామూర్తి

చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు రాజ్యసభ ఎంపీ సుధామూర్తి కీలక సూచనలు చేశారు. 3 ఏళ్ల వయసు నుంచే పిల్లలను స్కూల్‌కు పంపించాలని తెలిపారు. చిన్న వయసులోనే బ్రష్ చేసుకోవడం, స్వయంగా బ్రేక్‌ఫాస్ట్ చేయడం వంటివి నేర్పించాలని సూచించారు. అంతేగాక.. ఉచిత విద్యా హక్కును 3-6 ఏళ్ల వయసు పిల్లలకు కూడా అందేలా చూడాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.