VIDEO: నార్నూర్‌లో పోలీసుల వాహన తనిఖీలు

VIDEO: నార్నూర్‌లో పోలీసుల వాహన తనిఖీలు

ADB: నార్నూర్ మండల కేంద్రంలో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్సై గణపతిరావు హెచ్చరించారు. వాహనదారులు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.