ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి
అన్నమయ్య: రాయచోటి పట్టణంలో నిర్వహించిన పవిత్ర ఇఫ్తార్ విందులో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీ సోదరులతో కలిసి ఆయన సౌహార్ద వాతావరణంలో ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రంజాన్ మాసం అందరికీ శాంతి, సౌభ్రాతృత్వం, సుభిక్షం తీసుకురావాలని ఆకాంక్షించారు.