కంబకాయలో పిచ్చికుక్క స్వైర విహారం

కంబకాయలో పిచ్చికుక్క స్వైర విహారం

SKLM: నరసన్నపేట మండలం కంబకాయలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ కుక్క దాడిలో గురువారం బైరి కృష్ణారావు, అల్లు రాజబాబు, గొండు నీలమ్మ, చెట్టు సరోజనిలతో పాటు మరొకరు గాయపడ్డారు. మూడు రోజుల కిందట ఇదే కుక్క మూడు ఆవులు, రెండు మేకలపై దాడి చేసి గాయపరచగా అవి మృతి చెందినట్లు గ్రామస్తులు వెల్లడించారు.