మరోసారి నెతన్యాహు భారత్ పర్యటన రద్దు!
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత పర్యటన మరోసారి రద్దు అయినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఢిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్యా ఈ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదిలో భారత్‌ను సందర్శించి ప్రధాని మోదీ కలవనున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ ఏడాదిలో పలు కారణాల వల్ల నెతన్యాహు పర్యటన రద్దు కావడం ఇది మూడోసారి.