ప్రజా సమస్యల వేదికలో 35 అర్జీలు

ప్రజా సమస్యల వేదికలో 35 అర్జీలు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 35 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీ బీ. ఉమామహేశ్వర్‌కి వినిపించారు. అర్జీలను చట్టపరిధిలో పరిశీలించి, సంతృప్తికరంగా పరిష్కరించాలని ఆయన పోలీస్ అధికారులను ఆదేశించారు.