వాయు కాలుష్యం నియంత్రణకు గుగ్గిలం చెట్టు

వాయు కాలుష్యం నియంత్రణకు గుగ్గిలం చెట్టు

వాయు కాలుష్యం మనిషి మనుగడకు పెను సవాల్ విసురుతోంది. ఢిల్లీ నుంచి అనేక పట్టణాల వరకు సమస్యగా మారింది. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్ వర్సిటీకి చెందిన పరిశోధకులు సహజసిద్ధ 'ఎయిర్ ప్యూరిఫయర్'తో దీని కట్టడి మార్గం కనుగొన్నారు. అదే గుగ్గిలం చెట్టు. దుమ్ము, పొగ, వాహన కాలుష్యాన్ని నియంత్రించడంలో సమర్థంగా పనిచేస్తోందని తమ అధ్యయనంలో గుర్తించారు. ఈ చెట్టు జీవితకాలం వందేళ్లకుపైగా ఉంటుంది.