గ్రామపంచాయతీ సిబ్బందికి సేఫ్టీ కిట్స్ పంపిణీ

గ్రామపంచాయతీ సిబ్బందికి సేఫ్టీ కిట్స్ పంపిణీ

JGL: గొల్లపల్లి మండలంలోని బొంకూర్ గ్రామంలో ఆదివారం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో భాగంగా గ్రామపంచాయతీ సిబ్బందికి సేఫ్టీ కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం గ్రామపంచాయతీ సిబ్బందితో పాటు ఆశా వర్కర్లను సర్పంచ్ శిరీష ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉప సర్పంచ్ శ్రీధర్, గ్రామ కార్యదర్శి కనకలక్ష్మి, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.