VIDEO: జిల్లాలో వసంత పంచమి శోభ
శ్రీకాకుళంలో వసంత పంచమి శోభ నెలకొంది. నగరంలో ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. గుజరాతీపేట శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి కుంకుమ పూజలు చేశారు. మరోవైపు పీఎన్ కాలనీలో రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. తెల్లవారుజామున నుంచే రద్దీ నెలకొంది.