'నేటి నుంచి NTR వైద్య సేవా సిబ్బందికి సెలవులు రద్దు'
VZM: జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవా (ఆరోగ్యశ్రీ)పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి శుక్రవారం నుంచి సెలవులు లేవని వైద్యసేవ ట్రస్ట్ జిల్లా సమన్వయ అదికారి సాయిరాం ఇవాళ తెలిపారు. వైద్యసేవ పైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెలో పాల్గొనడంతో NTR వైద్యసేవ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నామని, నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె విరమించే వరకు సిబ్బంది నిర్విరామంగా పని చేయాలన్నారు.