నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

KKD: జగ్గంపేట మండలం జె. కొత్తూరు శివారు నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం సిబ్బందితో దాడి చేసినట్లు జగ్గంపేట ఎస్సై టీ. రఘునాధరావు తెలిపారు. ఈ దాడుల్లో నలుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి రూ. 10,250ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు.