గ్యాస్ కొరతపై చర్చ.. రాహుల్, ప్రియాంక వాకౌట్
లోక్‌సభలో గ్యాస్ కొరతపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వట్లేదని కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. అయినప్పటికీ విపక్షాలు ఆందోళన విరమించకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు.