రేపు వికారాబాద్‌కు మంత్రి రాక

VKB: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం వికారాబాద్‌కు రానున్నారు. ఉదయం11 గంటలకు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కాసాని జ్ఞానేశ్వర్ వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో సాగు చేసేందుకు ఆయిల్ పామ్ మొక్కలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్పీకర్ ప్రసాద్ కుమార్ నాటి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వ్యవసాయ దారులు హాజరుకావాలని కోరారు.