భారీగా పట్టుబడ్డ గంజాయి
TG: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. రూ.26 లక్షల విలువైన 51 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న కారు, బైక్ సీజ్ చేశారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.