'గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి'
VKB: తాండూరు మండలం గౌతపూర్‌లో ఇవాళ రూ.8 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నాగప్ప, సర్పంచ్ సృజన పాల్గొని పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.